శృంగార సంకీర్తన
రేకు: 2002-2
సంపుటము: 29-548
రేకు: 2002-2
సంపుటము: 29-548
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
| ఏల పచ్చి సేసేవు నన్నిందరిలోనా యేలినవాఁడవు నీవు ఇల్లాల నేను | ॥పల్లవి॥ |
| గుట్టుతోడిదాననని గోర నన్నూఁదకుమని నెట్టుకొని మొక్కితిఁగా నేను నీకు చిట్టకాలు మానుమని సిగ్గువరచుకుమని గట్టిగా నీ చెక్కు నొక్కి కడు వేఁడుకొంటిఁగా | ॥ఏల॥ |
| పెనఁగులాడకుమని పిసుకకు చన్నులని వినయము సేసితిఁగా వేమారు నీకు వొనర బొంకకుమని వొట్టులు వెట్టకుమని యెనసి నే నిట్టే సేవలెల్లాఁ జేసితిఁగా | ॥ఏల॥ |
| యెప్పుడూఁ బాయకుమని యిన్నిటా వలతునని చెప్పితిఁగా ప్రియములు సేనమారులు యిప్పుడే శ్రీవేంకటేశ యేలితివి నన్ను నీవు మెప్పించి రతుల నీతో మేలము తాడితిఁగా | ॥ఏల॥ |


