అధ్యాత్మ సంకీర్తన
రేకు: 280-2
సంపుటము: 3-460
రేకు: 280-2
సంపుటము: 3-460
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఎక్కడి పుట్టుగ లిఁక నెక్కడి మరణములు మిక్కిలి నీ ముద్రలు నా మేననున్న వివిగో | ॥పల్లవి॥ |
| కెరల పాపములకుఁ గెరల కర్మములకు హరి నీ నామము నోరనంటితేఁ జాలు నరకములేమి సేసు నా నేరమేమిసేసు నిరతి నా మతిలోన నీ వుండఁగాను | ॥ఎక్క॥ |
| చిక్క నింద్రియములకు చిక్కను బంధములకు చొక్కి హరి నీ మఱఁగు చొచ్చితిఁ జాలు మొక్కనేలే యెవ్వరికి మొరవెట్ట నేమిటికి నిక్కపు మా యిలువేల్పు నీవై వుండఁగా | ॥ఎక్క॥ |
| దగ్గరవు మాయలింక దగ్గరవు దుర్గుణాలు నిగ్గుల శ్రీవేంకటేశ నీవు గల్గఁగా యెగ్గులేదు తగ్గులేదు యిఁక నీదాసులలోన వుగ్గువలె నీప్రసాద మూనినది వొడల | ॥ఎక్క॥ |


