సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 242 సంకీర్తన: 252
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 3
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 242 సంకీర్తన: 252
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 3
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్ర
| అక్కరో తానేటి - కలిగినాడే మక్కువ(తో) రమ్మనవే - మలగునియనిన్నస్వామిని | ॥పల్లవి॥ |
| తోయజాక్షి! నన్నేల - దూరేవే, నే సేయరాని పనులేమైన - జేసితినా వెయ్యారువిధముల తా - వేడగ ముద్దిడుచు నయ్యెడ (నా) మోవిపంట - నదిమితినింతేకాని | ॥అక్కరో॥ |
| నారీమణి! నన్నాడు - కొనంగా నేటికే? మేరమీరి నేజేసిన - నేరము (కాగలదా) చేరిచేరి ప్రియములు - చెప్పగనే కాగిలించి వూరక గబ్బిగుబ్బల - నొత్తితి నింతేకాని | ॥అక్కరో॥ |
| రామ! శ్రీవేంకటప్రభుడు - రచ్చనిడనేలే యేమైన నా వల్ల త - ప్పింతయైననున్నదే ప్రేమముతో తానె కాచినను - కామించి కూడగ ఆ మెయిరతులనింత - నలయించితి నింతె కాని | ॥అక్కరో॥ |


