సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 49 సంకీర్తన: 48
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 5
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 49 సంకీర్తన: 48
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 5
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం - ఖండచాపు
| అదె వచ్చె చెలియ యొ - య్యారంబుతో ప్రియుని సదనంబు వెడలి తన - సఖులు గనకుండ | ॥పల్లవి॥ |
| నుదుటి కస్తురి చెమట - (నొసట) పదనై జార (నదిమి వీడిన తురుము) - గుదురుపరచి వొదిగొదిగి తనకెవ్వ - రెదురౌదురో యనుచు పెదవిగంటి మడుపు - తుద మాటుగొంటా | ॥అదె॥ |
| నునుగుబ్బకవ గోటి - కొన జీర మరుగువడ పెనుగెంపుబన్నసరు - లనువుబరచి తన కెందళుకు కన్ను - లను నిద్ర సొలయగా వనజము మూర్కొని యూర్పు - వడి నణచుకొంటా | ॥అదె॥ |
| అలసత తత్తరపడుచు - నవ్వలివ్వల గట్టు చలువశాటివలువ - సడలగాను అల శ్రీవేంకటరా - యని తోడి సరసపు కలయికలు మదిలోనఁ - దలఁచుకొంటా | ॥అదె॥ |


