Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 204 సంకీర్తన: 214
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 7
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
అనువెరగంగలేని - దటే యాటదనము; విభుని
యెనసి మెప్పించగలేని - దేటి యాటదనమే
॥పల్లవి॥
కొదమగుబ్బల యురము - గుబ్బ వీపున వెడల
నదమకుండగలేని - దది యేటి యాట దనమే
కదిమి మోవితేనెలూరగా - (గాడిన) కెంపులు
యెదురుగుప్పగలేని - దేటి యాటదనమే
॥అనువె॥
కదిసినప్పుడె వుపరి - గతుల బొమ జంకెనల
అదరించకున్ననది - యటే యాటదనమే
పదిలముగ పతి పానుపు - పనులకు దనుజేర
నెదురుపట్టగలేని - దేటి యాటదనమే
॥అనువె॥
వలసినంత రతుల - కలయికల వేడుకల
నలయించగా లేని - దటే యాటదనమే
అలమేలుమంగ శ్రీవేంక - టప్పని కౌగిట గూడి
యెలమికెక్కని దది - యేటి యాటదనమే
॥అనువె॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము