సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 246 సంకీర్తన: 257
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 8
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 246 సంకీర్తన: 257
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 8
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్ర
| అయ్యయ్యో వేంకటరమణా - ఆడుకొందురా చెలిని గయ్యాళియని సారెసారె - కాకు సేతురా | ॥పల్లవి॥ |
| సిగ్గువడక చెప్పేవు - చెలి నిన్ను దిట్టేనని దిగ్గన వలపుల దిట్టు - దీవెన గాదా యెగ్గుతిని వచ్చేవు - యింతి జడ గొట్టెనని అగ్గలంపు మోహమున - కదె గురుతు గాదా | ॥అయ్యయ్యో॥ |
| పలుమారు దూరేవు - పాదమున దన్నెనని పొలతి గూడుట కదె - పొత్తు గాదా కొలదెరుగ కాడేవు - కొనగోర జీరె నని వలపు నిలుపుట కదె - వారకము గాదా | ॥అయ్యయ్యో॥ |
| పట్టిపట్టి పెనగేవు - పంటికొద్ది నొక్కెనని వెట్టదేరు మోహపు మోవి - విందునకు గాదా యిట్టె యలమేల్మంగ - యెద నెక్కే ననేవు నెట్టన వేంకటరమణ! ని - న్నేలుటకు గాదా | ॥అయ్యయ్యో॥ |


