సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 184 సంకీర్తన: 191
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 11
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 184 సంకీర్తన: 191
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 11
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది - అట
| అయ్యో రామామణి! నిన్ను జూడనిచూపు - లవి యేటి చూపులే నెయ్యంపు నీ జోడుగూడని - నీటులవి యేటి నీటులే | ॥పల్లవి॥ |
| వెలది! నీ మోవితేనె గూడని - వీడెమది యేటి వీడెమే కలయ నీ మేనితావి గలయని - గంధమేటి గంధమే పొలతి! నీ కుంతలపు తేంట్లానని - పువ్వులేటి పువ్వులే తొలక నీ చమటల దొప్పదోగని - దుప్పటేటి దుప్పటే | ॥అయ్యో॥ |
| సుదతి! నీ పలు సోకుకెనయని నీ - సోకులేటి సోకులే పదరేటి నీ (యుడుకుల) కులకని - పానుపేటి పానుపే పొదలు నీ చనుమొనలు నాటని - పులకలేటి పులకలే గదియ నీ కౌగిట బిగియానని - కాయమేటి కాయమే | ॥అయ్యో॥ |
| నారీమణి! నీ నెమ్మోము ముందర - నవ్వని నవ్వులేటి నవ్వులే గోరురేఖలు జారని నీ జవ్వాది - జారులేటి జారులే సారె నీ వూర్పులు పైపొలయని - చలువలేటి చలువలే యేరా వెంకటపతియని కొసరని - యింపులేటి యింపులే | ॥అయ్యో॥ |


