అధ్యాత్మ సంకీర్తన
రేకు: 280-4
సంపుటము: 3-462
రేకు: 280-4
సంపుటము: 3-462
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగం
| చరమార్థమందు నీవు చాటితివి గాన ఇరవిది నమ్మితి నా కెదురెందు లేదు | ॥పల్లవి॥ |
| పతికిఁ జనవరైన ప్రాణధారి లెంకలకు తతినేమి సేసినాను తప్పులేదు సతతము హరి నీ శరణాగతుఁడ నాకు (గాన?) అతిపాపము సేసిన అది నాకు లేదు | ॥చర॥ |
| పారుచు నగరి డాగు పసుర మెవ్వరిచేని- పైరు మేసినా నందు బందె లేదు సారె నీ ముద్రలు మోచి సంసారవిషయాల యేరీతిఁ బొరలినా యెగ్గే లేదు | ॥చర॥ |
| ధర్మానఁ గొని తెచ్చిన దాసులకు వూర వెట్టి- అర్మిలిఁ జేయఁగఁ బని అంతలేదు నిర్మల శ్రీవేంకటేశ నీ కరుణగల నాకు కర్మ లోపమైనాను కడమే లేదు | ॥చర॥ |


