సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 117 సంకీర్తన: 117
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 22
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 117 సంకీర్తన: 117
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 22
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడ - త్రిపుట
| ఆటదాననె పో నీరజద - ళాక్షి!వానినిప్పుడె (చాటి) నాకైవ - శము చేసుకోకున్నను | ॥పల్లవి॥ |
| మిగుల మాటపట్టు - మీరు చూడగనిచ్చి తగవుదప్పి ఆకె - దండనున్నందుకు బిగువుగుబ్బల గుమ్మి - (బీరము)లాడుచు మొగమోటములేక వాని - మోవినొక్కకున్నా, నే | ॥ఆటదాననె॥ |
| యీరాని బాసలెల్ల - నింతులెరంగ, నిచ్చ మేరకిచ్చి యాకెతో- మేలమాడినందుకు సారెకు రాకొట్టుచు - దూరుచు (బెక్కులు) జీరలుగా వాని- చెక్కులు చేయకున్నా, నే | ॥ఆటదాననె॥ |
| యెక్కడికి తాబోనని- యిందరిలో నాడి టక్కరించి (వేగమె)దానితో- (చొక్కి)తేలినందుకు పెక్కువగలవాని - బెనగుచు నలయింపుచు యెక్కువ వేంకటనాథ- యెదనెక్కకున్నా, నే | ॥ఆటదాననె॥ |


