సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 206 సంకీర్తన: 217
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 51
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 206 సంకీర్తన: 217
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 51
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
| ఎంత మేలు చేసినదో యేమిచెప్ప చిత్త మంతయు నీకిచ్చిన యొయ్యారి యెవ్వతెరా | ॥పల్లవి॥ |
| దాడింబ పువ్వులవన్నె తళుకుఁబయ్యెద కొంగు వేడుకతో వల్లెవాటు వేశి గోడనెక్కి చూచి తనకొప్పు చెంగలువబంతి నోడక వేసినయట్టి యొరపరెవ్వతెరా | ॥ఎంత॥ |
| కంకణాల మెఱఁగుల కరము లొయ్యన యిరు వంకల చెలులమీఁద వైచి కొంకక తమలపాకు కొనవంక గఱచి నీ వంక చూచి సన్న సేసె వనిత యెవ్వతెరా | ॥ఎంత॥ |
| పిక్కటిల్లునట్టి తన బిగువుఁజన్నుల కాంతి వెక్కసమై యిరువంక వెడల యెక్కువతోఁ దిరువేంకటేశుండ నిన్నుఁ గూడి చెక్కునొక్కి కౌఁగిలించె చిత్తణి యెవ్వతెరా | ॥ఎంత॥ |
(ఈ సంకీర్తన 6వ సంపుటంలో 42వ సంకీర్తనగా ఉంది.)


