Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 141 సంకీర్తన: 143
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 55
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
ఎటువంటి రాజీకమే చెలియ నేడు
కటకటా యెందైన కంటిరా మీరు
॥పల్లవి॥
గోరంట్లసీమ పెనుకూటంబు మూకచే భారంబుదుర్గములు పట్టువడెను
సారెసారెకు మధ్యదేశంబు బయలాయె చేరి మధురాపురము సూరలటు బోయెన్‌
॥ఎటువంటి॥
కదిసి యట్టిట్టాయె కాశ్మీరమండలము నెరిచిక్కువడెను కుంతలరాజ్యము
మ(వ?)రుస చీకాకాయె నెరి కుంభకోణంబు తురువుగాయల గోలకొండలోనాయెన్‌
॥ఎటువంటి॥
వింతపూర్వుల పూర్వులిడదండు విడిచిన కొండ తామెరకోలన కోలుపాయె
నంత శ్రీవేంకటేశుడలమేలుమంగజేరి సంతతము కల్యాణసామ్రాజ్యమేలెన్‌
॥ఎటువంటి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము