Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 221 సంకీర్తన: 232
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 61
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం - అట
ఎన్ని తపంబులు చేసి - నిన్ను పెండ్లాడెనొ మంగ!
చెన్నుమీర చెంచువాడె - శ్రీమంతుడు (కాగలిగె)
॥పల్లవి॥
నారచీరలే గట్టి - నడచేటివానికి
గారవాన పీతాంబరములు - గట్టగలిగె
కోరి రేగు, జీడిపండ్లు - ఏరుకొని తినేవానికి
సారె సారె పంచదార - లారగించ గలిగె
॥ఎన్ని॥
పన్నుగ పొదరిండ్లలోన - పవ్వళించేవానికి
వున్నతంపు మేడలోన - నుండగలిగె
సన్నపు గొజ్జంగి దండ - సందిట గట్టిన వానికి
మిన్నలు ముత్యంపు సరులు - మెడ(న) వేయగలిగె
॥ఎన్ని॥
పలుమారు గువ్వల - పలుకులు వినేవానికి
వెలయగాను సంగీతము - వినగలిగె
అలమేలుమంగ! (నీవె - కొలువై యక్కున జేరగ)
అలరీ శ్రీవేంకటేశు - డనే పేరుగలిగె
॥ఎన్ని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము