Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 118 సంకీర్తన: 118
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 67
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: లుప్తము
ఏకాలము నామనే యెఱిఁగిన దాసులకు
దాకొనీ శ్రీహరిభక్తి దారణ గలిగితేను
॥పల్లవి॥
వుడివొడేకాలము వొక్క తతి రావద్దు
చెడని శ్రీహరిభక్తి చెట్టుకట్టితే
తొడుకు మేయఁగరాదు తూర్పెత్తితేఁ బొల్లు వోదు
బడినే శ్రీహరిభక్తిపంట వండితేను
॥ఏకాలము॥
వలువ దీసితేఁ బోదు వాడుకొంటే వెల్తి గాదు
కొలచి శ్రీహరిభక్తి కుప్ప చేసితే
యెలుకకు దినరాదు యెన్నాళ్లునాఁ జివుకదు
తలఁచి హరిభక్తిచిత్తపుగాదెఁ బెట్టితే
॥ఏకాలము॥
కఱవుకు లోఁగాదు సుంకరవానికి నబ్బదు
యెఱుకతో హరిభక్తి యిల్లు నిండితే
నెఱవై శ్రీవేంకటేశ నీకృపగలవారికి
గుఱిగాఁగ హరిభక్తి కూడపెట్టుకొంటేను
॥ఏకాలము॥

(ఈ సంకీర్తన 15వ సంపుటంలో 364వ సంకీర్తనగా ఉంది.)

AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము