అధ్యాత్మ సంకీర్తన
రేకు: 281-3
సంపుటము: 3-467
రేకు: 281-3
సంపుటము: 3-467
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| పాడేము నేము పరమాత్మ నిన్నును వేడుక ముప్పదిరెండువేళల రాగాలను | ॥పల్లవి॥ |
| తనువే వొళవు తలయే దండెకాయ ఘనమై వూర్పులు రెండు కట్టిన తాళ్ళు మనసే నీబద్దితాడు మరి గుణాలె జీవాళి మొనసిన పుట్టుగే మూలమైన కరడి | ॥పాడే॥ |
| పాపపుణ్యా లిరువంక పైఁడివెండియనుసులు పైపైఁ గుత్తికె మేటిపై చనిగె కోపుల నాలికెలోనఁ గుచ్చికట్టినట్టి తాడు చూపరాని సంసారమే సూత్రపు గణికె | ॥పాడే॥ |
| జీవునికిని దండె సేసినవాఁడవు నీవు వావాతి మాటలే నీపై వన్నెపదాలు యీవి మాకు నిహపరా లిచ్చితివి మెచ్చితివి శ్రీవేంకటేశ నీవే చేకొన్నదాతవు | ॥పాడే॥ |


