సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 248 సంకీర్తన: 260
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 88
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 248 సంకీర్తన: 260
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 88
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
| ఓరీ రారా! వొద్దికై రారా! పేరడిగా వలపించిన వాడ | ॥పల్లవి॥ |
| చిన్ననాట నుండి - సిగ్గులు బడకుండ సన్నలచాయల - సరసమాడి కన్నెపాయపుబోటి - కడగంటి తామెర కన్నులు గాసే వెన్నెల - గాసేటివాడ | ॥ఓరీ॥ |
| పిందెల చన్నులు - బిందెలుగా జేసి సందుల పులకింత - కందువగా జేయుచు ముందు ముందె నీ - మోవి తేనె నాకు విందులు బెట్టేటి - వేడుకకాడ | ॥ఓరీ॥ |
| కలికితనంబున - కరగించితినని అలమేలుమంగ మే - లని పొగడితివి సలిగె యిచ్చినట్టి - జవ్వని యడవున వెలయ గూడితివి శ్రీ - వేంకటనాథ | ॥ఓరీ॥ |


