Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 202 సంకీర్తన: 212
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 91
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ - అట
కంటిఁగంటి నిలువుచక్కనిమేను దండలును
నంటుఁజూపులను జూచే నవ్వుమోముదేవుని
॥పల్లవి॥
కనకపుఁబాదములు గజ్జెలు నందెలును
ఘనపీతాంబరము పైకట్టు కటారి
మొనసి యొడ్డాణపు మొగపుల మొలనూలు
ఒనర నాభీకమల ముదరబంధములు
॥కంటి॥
గరిమ వరదహస్త కటిహస్తములును
సరస నెత్తిన శంఖచక్రహస్తములు
ఉరముపై కౌస్తుభ మొప్పగు హారములు
(తరుణి యలమేల్మంగ తాళి పద్మలును)
॥కంటి॥
కట్టిన కంటసరులు ఘనభుజకీర్తులు
కట్టాణిముత్యాల సింగారనామము
నెట్టన శ్రీవేంకటేశ నీకుఁ గర్ణపత్రములు-
నట్టె సిరసుమీఁద నమరే కిరీటము
॥కంటి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము