సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 188 సంకీర్తన: 196
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 94
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 188 సంకీర్తన: 196
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 94
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
| కటకటా విరహు లెక్కడ బ్రదుకఁగలవారు కుటిలంపుఁగీరములు గూఁటఁబడవాయె | ॥పల్లవి॥ |
| పంచబాణునకు నాపద లెందు లేవాయె మంచుఁగిరణము లతనిమీద మణఁగదాయె పెంచుకోవిలనోరు పెడతటికిఁ బోదాయె చంచరీకములకునుఁ జావు లేదాయె | ॥కటకటా॥ |
| చిగురాకుఁ గులమునకుఁ జే టెందు లేదాయె పగటు నునుగాలిఁ బెనుబాము దినదాయె సొగసుఁగమ్మని విరుల చొప్పణఁగి పోదాయె బిగువు నామనిమీఁదఁ బిడుగువడదాయె | ॥కటకటా॥ |
| తిరువేంకటాచలాధిపుని కరుణారసము తరుణులకు నందఱికి దైవాఱదాయె పరివోనిసురతసంపదలఁ దెప్పలఁదేలి వరవధూతతికిఁ బరవశము లేదాయె | ॥కటకటా॥ |
(ఈ సంకీర్తన 6వ సంపుటంలో 92వ సంకీర్తనగా ఉంది.)


