సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 222 సంకీర్తన: 233
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 99
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 222 సంకీర్తన: 233
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 99
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| కలకంఠు(లాలా) రారే - కర కంకణ తాళ గతుల-(నలుగు పెట్టుచు పాడరే) మలసీ పన్నీరు పునుగు-తలిరూ గంధము లలది-మజ్జన (మప్ప)నికి సేయరే | ॥పల్లవి॥ |
| (నూలీ) గోణమ్ము జుట్టరే - నెత్తావి (మించు) - నూనియ (తల) నంటరే మేలిమి కస్తూరి (మెత్తరే) - కుంకుమపూవు - మేదించి నలుగు బెట్టరే ఆలవట్టములు (ప)ట్టరే - మా యప్పనికి - (అంది) వీడ్యమ్ములియ్యరే చాలా బంగారు గిన్నెలా, ముంచి - జలకము పన్నీరు బోయరే | ॥కలకంఠు॥ |
| దప్పిదీర వలిప (మద్దరే) - తడయక మెయి చి - త్తడి (యారగానొ)త్తరే కప్పుర హారతు లెత్తరే - మేన పచ్చ - కప్పురంపు ధూళి మెత్తరే పుప్పొడి (గంధాలు మెదుచరే), తట్టు - పునుగూ మెయి నిండా - బుయ్యరే చొప్పుదనర (కీలించరే) చిరత్న కిరీటము - సొమ్ములు నిండార జాతరే | ॥కలకంఠు॥ |
| గొబ్బున చెంగావి కట్టరే, గొప్ప (గొనబు) - కుచ్చుల కటారి జెక్కరే (గుబ్బసరము) మంగ తాళి(రే) - కూర్చి మెడ(ను) గుచ్చి గట్టరే గబ్బి చేతల (నెంచరే) శ్రీవేంకటేశ - గన్నుల పండువగా జూడరే అబ్బురంపు (టోరెము లమరే) ఆనవాలు - ఆరగింపు సేసికొనరె | ॥కలకంఠు॥ |


