Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 100 సంకీర్తన: 100
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 101
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము - అట (కావచ్చును)
ఆళాపచారి
కాకకొన్నాడు నీ - కాంతు డోవరిలోన
చేకొన సిగ్గేటికి - చేర గదో యమ్మ
॥పల్లవి॥
కొమిరె వయసు తోడి - (కొత్త) పెండ్లికూతురా!
కమలములోని బం - గారు బొమ్మా!
విమలమై నిలువెల్ల - వెన్నెల గాసే తల్లి
చెమరించ పాన్పు మీదికి - చేర గదో యమ్మ
॥కాకకొన్నాడు॥
చందమామ తోబుట్టు(వ!) - జవ్వనంపు చెలియ!
కందులేని నెమ్మోము(గల) - కప్పుర గంధి!
గంధపు వాసనల(తోడి) - కలశాబ్ధి కన్య!, గో
విందుని పాన్పుమీదికి - (విచ్చేయ) గదో యమ్మ!
॥కాకకొన్నాడు॥
అతి మోహనాంగియైన - యలమేలుమంగ
కతలకారి కలికి చిలు - కల కొలికి!
రతిగూడి (శ్రీ వేంకట - రమణు డోవరి, సం)
గతి గూడి వోలాడే - గదవో యమ్మా!
॥కాకకొన్నాడు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము