Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 65 సంకీర్తన: 64
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 102
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
కాతరపుదాన నేను - ఘనుడు తాను
గాతకింత యోర్చితే - కరుణించు మనీనే
॥పల్లవి॥
కొప్పువట్టి తియ్యరాదు - కొనగోర జీరరాదు
చెప్పితన సేవ యెట్లు - సేయింతునే?
ముప్పిరి దిట్టగరాదు - మోవిగంటు సేయరాదు
అప్పటి సరసాలె - ట్లాడు మనీనే?
॥కాతరపుదాన॥
తమ్ములము బెట్టరాదు - తతి కాలువేయరాదు
నమ్మి తనతో నెట్లు - నవ్వుమనీనే?
కిమ్ముల రాకొట్టరాదు - కిందుపరచగా రాదు
కమ్మటి తనతో నెట్లు - కత చెప్పుమనీనే?
॥కాతరపుదాన॥
చేముట్టి చెనకరాదు - చేరి పనిగొనరాదు
ఆముకొని పెండ్లియె - ట్లాడుమనీనే?
యీ మేర శ్రీవేంకటేశు - డింతలోన నన్ను గూడె
కామించి తనతో నెట్లు - కౌగిలించుమనీనే
॥కాతరపుదాన॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము