Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 80 సంకీర్తన: 80
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 103
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
కామయాగము చేసెఁ గలికి తన
ప్రేమమే దేవతాప్రీతిగాను
॥పల్లవి॥
పొలుపలర సురతతాంబూలరసపానంబు
నలినాక్షి సోమపానంబు గాను
కలకలంబుల మంచి గళరవంబుల మోఁత
తలకొన్న వేదమంత్రములుగాను
॥కామయాగము॥
పఁడతి తన విరహతాపమునఁ బుట్టిన యగ్ని
అడరి దరికొన్న హోమాగ్నిగాను
ఒడఁబడిక సమరతుల నుదయించిన చెమటఁ
దడియుటే యది యవభృథంబుగాను
॥కామయాగము॥
తనరఁ గుచముల రుచులు దంతా(త?)క్షత క్రీడ
ననుపైన పశుబంధనంబుగాను
యెనసి శ్రీతిరువేంకటేశ్వరుని పొందు
ఘనమైన దివ్యభోగంబుగాను
॥కామయాగము॥

(ఈ సంకీర్తన 5వ సంపుటంలో 223వ సంకీర్తనగా ఉంది.)

AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము