సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 269 సంకీర్తన: 285
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 105
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 269 సంకీర్తన: 285
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 105
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి - జంపె
| కాముఁ డెవ్వరి నేసె - కలువ యెవ్వరిగాడె కామినుల భ్రమగాక - కలఁడు వేరొకఁడు | ॥పదం॥ |
| చెరకులట సింగిణులు - చిలుకలట తేజీలు పరచు వెడదేటులట - పరివారము మరులుకొని జనులాడు - మాట నిజమని నమ్మి వెరవ నేటికి కొమ్మ - విడువు మీ భయము | ॥కాముఁడె॥ |
| అలరులట బాణాలు - ఆమనట దళవాయి తలకూత పికములట - దండిపౌజు తెలియ కిట్లాడు ప - ల్కులకేల వెరవనిటు తలపోయ నీవంటి - తరుణికిది తగునా | ॥కాముఁడె॥ |
| చిగురులట కైదువలు - చంద్రుఁడట గమికాఁడు వెగటు చలిగాలియట - వెన్నుబలము జిగిని యలమేల్మంగ - శ్రీవేంకటేశ్వరుని తగిలి తివియఁగ నేల - తహతహలు నీకు | ॥కాముఁడె॥ |


