Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 48 సంకీర్తన: 47
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 107
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
కొండవలె నిను జూచు - కొనియున్నవాడ
గండు మీరు తమకము కడకు - గడు దోయకువె
॥పల్లవి॥
గుబ్బలనే కసిదీర - గుమ్మినా గుమ్ముదువు గాని
గబ్బివై యావలి మోము - గాకువే నీవు
సిబ్బెపు మైగోరి కొద్ది - జీరిన జీరుదువు గాని
మబ్బు జూపు కెంపుల బొ - మ్మముడి బెట్టకువే
॥కొండ॥
నోవపంటి కొద్ది మోవి - నొక్కినా నొక్కుదువు గాని
కైవశపు నన్నెరవు - (గా)ఁ జూడకువే
చేవ కౌఁగిట కూరాకు - సేసినా సేతువుగాని
కావరపు నా వలపు - గాడి పరచకువే
॥కొండ॥
చేరువ రతి నోటమి - సేసినా సేతువు గాని
వారకపు నాపై బత్తి - వదలకువే
గారవించి నన్ను శ్రీవేం - కటప్పడ కూడితివి
యేరీతినుండినా - యెద (నుండి) దిగకువే
॥కొండ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము