సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 255 సంకీర్తన: 268
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 111
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 255 సంకీర్తన: 268
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 111
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
| గుజగుజ రే - కుల (బాడనియ్యము) అజుడు శివుడు వచ్చి - యడిగినగాని | ॥పల్లవి॥ |
| యిట్టి మాయింటికి తానె - యేగివచ్చినగాని చెట్టబట్టి బువ్వాన బో - సేసినగాని (పట్ట)పు రా(ణి పగిది) - పాలించీ ననినగాని పెట్టు ముత్యాల సేసతో - బెండ్లాడినగాని | ॥గుజ॥ |
| సంగతి సరిలేని (నిక్కు)- జాలించినను (గాని) అంగనపై నెవ్వతె దే - ననినగాని అంగడి బెట్టక నింతితో - నలుగనంటే గాని చెంగట మిమ్మిందరి ర - క్షించేనంటే గాని | ॥గుజ॥ |
| వొప్పుల మోవి సతికి - వుంకువ యిచ్చినగాని యెప్పుడును సతి నిట్లే - యేలినగాని అప్పడు వేంకటరాయ - అలమేల్మంగ నాంచారి తెప్పిరి కొమ్మ నెద - దించనంటే గాని | ॥గుజ॥ |


