Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 126 సంకీర్తన: 127
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 115
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: ముఖారి
చీచీ నరుల దేఁటి జీవనము
కాచుకొని హరి నీవే కరుణింతుగాకా
॥పల్లవి॥
అడవిలో మృగజాతియైనాఁ గావచ్చుఁగాక
వడి నితరులఁ గొలువఁగ వచ్చునా
వుడివోని పక్షియై వుండనైనా వచ్చుఁగాక
విడువ కెవ్వరికైనా వెఁడవచ్చునా
॥చీచీ॥
పసరమై వెతలేని పాటువడవచ్చుఁగాక
కసటు వొనరులఁ బొగడవచ్చునా
వుసురు మానై పుట్టివుండనైనావచ్చుఁగాక
దెసల నెక్కడనైనాఁ దిరుగవచ్చునా
॥చీచీ॥
యెమ్మెల పుణ్యాలు సేసి యిల నేలవచ్చుఁగాక
కమ్మి హరి దాసుఁడు గావచ్చునా
నెమ్మది శ్రీవేంకటేశ నీ చిత్తమె కాని
దొమ్ముల కర్మము లివి తోయవచ్చునా
॥చీచీ॥

(ఈ సంకీర్తన 15వ సంపుటంలో 86వ సంకీర్తనగా ఉంది.)

AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము