సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 58 సంకీర్తన: 57
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 116
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 58 సంకీర్తన: 57
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 116
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: లుప్తము - ఏక
| చూచేవారికి ధర్మము సులభమువలె నుండు కాచి నమ్మి చేకొంటే ఘనునిఁగాఁ జేసును | ॥పల్లవి॥ |
| అరయ శ్రీపాదతీర్థ మల్పమువలె నుండు వరుసఁ బాపములను వక్కలించును వొరసి నీ నామ మొక్కమాటవలె నుండును నరకములు తరించి నంటున రక్షించును | ॥చూచేవారికి॥ |
| మహి నీ పూజ తులసీదళమాత్రమువలె నుండును యిహపరములు దానే యియ్య నోపును అహరహము నీ చింత ఆందోళమువలె నుండును విహితమై నీ కృపకు వెసఁ బాత్రుఁ జేసును | ॥చూచేవారికి॥ |
| చేరి నీకు మొక్కే మొక్కులు చేష్టలువలె నుండు ధారుణిలో భవవార్ధి దాఁటించును వూరకే నీ కిచ్చే కానుక వొక కాసువలె నుండును యీరీతి శ్రీవేంకటేశ యే వరమైనా నొసఁగును | ॥చూచేవారికి॥ |
(ఈ సంకీర్తన 15వ సంపుటంలో 339వ సంకీర్తనగా ఉంది.)


