సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 174 సంకీర్తన: 180
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 117
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 174 సంకీర్తన: 180
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 117
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
| చెప్పరాదుగదే మన - చిన్ననాటి నడకలు వొప్పులాయ తలచితే - వోలాల! | ॥పల్లవి॥ |
| పన్నీటికాలువ దండ - పచ్చకప్పురపు దిన్నె పొన్నలనీడ గొజ్జంగి - పొదరింటిలో సన్నపు పయ్యద వెట్టి - సంది సంది గ్రుచ్చుకొని వున్న బాగులెంచేవు - వోలాల! | ॥చెప్పరాదు॥ |
| పొత్తుల వీడెపు మరు - బువ్వపు తమలపాకు లెత్తిలి యొండొరులకు - నిచ్చే తమిని జొత్తిలు మోపుల పలు - సోకుల కాకలకుగాక వొత్తుకొంటివి చెక్కు - లోలాల | ॥చెప్పరాదు॥ |
| వుక్కుగోరితాకు - లొయ్యనె కళలంటగా పిక్కటిల్లు రతులనే - పిరిదియ్యక మక్కువతో నలమేలు - మంగ శ్రీవేంకటేశ్వర వొక్కటైతిమిద్దరము - వోలాల | ॥చెప్పరాదు॥ |


