అధ్యాత్మ సంకీర్తన
రేకు: 282-3
సంపుటము: 3-472
రేకు: 282-3
సంపుటము: 3-472
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| విజయపుటమ్ము వేసె వేంకటేశుఁడు విజయుని సఖుఁడు యీ వేదమూరితి | ॥పల్లవి॥ |
| పాఱితెంచి దశకంఠు పదిశిరసులమీఁద ఆఱికి(?)నమ్ము వేసె నాదిదేవుఁడు ఆఱడి సేనల తోడ నంబుధి మీఁద వేసె వేఱొకయమ్ము దొడిగి విష్ణుదేవుఁడు | ॥విజ॥ |
| చాలుగ నేడుదాళ్లు సర్వము నొక్కటిగాఁగ ఆలములో నమ్మువేసె నఖిలేశుఁడు ఆలించి రుక్మిణిఁ బెండ్లి యాడునాఁడు వైరులపై జాలి(?)యమ్ము వేసెను విజయకృష్ణుఁడు | ॥విజ॥ |
| భజన నిందిరఁగూడి పంతమున నమ్మువేసె విజయదశమిని శ్రీవేంకటేశుఁడు సుజనుల దేవతల సొరిది నిందరిఁ గాచు విజయము చేకొనె విష్ణుదేవుఁడు | ॥విజ॥ |


