సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 160 సంకీర్తన: 164
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 122
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 160 సంకీర్తన: 164
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 122
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేశాక్షి
| చేతకాని పనులెల్ల - జేసేది రోత నీతిలేనివానివద్ద - నిలిచేది రోత | ॥పల్లవి॥ |
| తడవుపుట్టింటను - తరుణినుంచిన రోత అడుగరానివాని - నడిగేది రోత పుడమిలో వలవని - పొలతి బొందుట రోత చెడి చుట్టము కడకు - చేరేది రోత | ॥చేతకాని॥ |
| అప్పుదీసి సౌఖ్యము - లనుభవించుట రోత తప్పు విచా(రించక తీర్పు) - చెప్పేది రోత ముప్పున బిన్నవయసు - ముదితచేకొన్న రోత చెప్పరాని పనులెల్ల - జేసేది రోత | ॥చేతకాని॥ |
| కలవానితోడను - కలహించేది రోత నలినాక్షుల పొందు - నమ్మేది రోత అలరి శ్రీవేంకటపతి - గొలువనియట్టి (కలి) నరుని జన్మము - కడకు రోత | ॥చేతకాని॥ |


