సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 261 సంకీర్తన: 275
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 123
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 261 సంకీర్తన: 275
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 123
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
| చేతు లలయ పూజ - సేతామురారో పూతనాసంహారుని, నవ - నీత కృష్ణుని | ॥పల్లవి॥ |
| నాథుఁడితఁడె రుక్మిణీ - నాథుఁడితఁడె రాధికా మనోహరుఁడైన వి - నోదుఁడితఁడె | ॥చేతు॥ |
| జారుఁడితఁడే నవనీత - చోరుఁ డితఁడె మారుని గన్నట్టి నందకు - మారుఁ డితఁడె | ॥చేతు॥ |
| (మాధవుం) డితఁడె కంస - మర్దనుం డితఁడె శ్రీధరుండైన వేంకట - నాథుఁ డితఁడె | ॥చేతు॥ |


