సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 191 సంకీర్తన: 198
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 125
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 191 సంకీర్తన: 198
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 125
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| జీవాతుమై యుండుచిలుకా నీ- వావలికి [1]పరమాత్ముఁడై యుండుచిలుకా | ॥పల్లవి॥ |
| ఆతుమపంజరములోన నయమున నుండి నా- చేతనే పెరిగిన చిలుకా జాతిగాఁ గర్మపుసంకెళ్లఁబడి కాల- జేతఁబేదైతివే చిలుకా భాతిగాఁ జదువులు పగలురేలును నా- చేత నేరిచినట్టిచిలుకా రీతిగా దేహంపురెక్కలచాటున నుండి సీతుకోరువలేనిచిలుకా | ॥జీవాతుమై॥ |
| బెదరి [2]అయిదుగురికిని భీతిఁబొందుచుఁ గడుఁ- [3]జెదరఁగఁ జూతువే చిలుకా అదయు[4]లయ్యిన శత్రులారుగురికిఁగాక అడిచిపడుదువే నీవు చిలుకా వదల కిటు[5] యాహారవాంఛ నటు పదివేలు- వదరులు వదరేటిచిలుకా తుదలేనిమమతలు తోరమ్ముసేసి నా- తోఁగూడి మెలగినచిలుకా | ॥జీవాతుమై॥ |
| నీవన నెవ్వరు నేనన నెవ్వరు నీవే నేనైయుందుఁ జిలుకా శ్రీవేంకటాద్రిపై చిత్తములో నుండి సేవించు కొని గట్టిచిలుకా దైవమానుషములు తలఁపించి యెపుడు నా- తలఁపునఁ బాయనిచిలుకా యేవియును నిజముగా నివి యేఁటికని నాకు నెఱిఁగించి నటువంటి చిలుకా[6] | ॥జీవాతుమై॥ |
(ఈ సంకీర్తన 1వ సంపుటంలో 50వ సంకీర్తనగా ఉంది.)
[1] ‘వావలికిఁబర’ అని పూ.ము.పా.
[2] ‘యైదుగురికిని’ అని పూ.ము.పా.
[3] ‘జెదరంగ’ అని పూ.ము.పా.
[4] ‘ లైన’ పూ.ము.పా.
[5] ‘కొను’ లేక ’కొనునట్టి’ కావచ్చు
[6] ఇది పెద్దపాట. దీనిలో ప్రతిచరణము రెండుపంక్తులకొక పాదముగ గుర్తించవలెను.


