Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 106 సంకీర్తన: 106
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 126
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: కేదారగౌళ
తనకుబోదు నాకుబోదు - తగులుచేసే మేనవావి
వెనక నేరమెంచి యెంచి - వెరపు(జూప)నేటికి
॥పల్లవి॥
చిలుకపోటు మోవితోడ - చిలుప చెమటమేనితోడ
వలపురేచ వచ్చెనమ్మ - వాడవారిమరది
అలుకసేయనేటికమ్మ - (అరసి) తానెతెలుసుకొని
పిలిచిపీట వెట్టరమ్మ - ప్రియము తోడ వీనికి
॥తనకు॥
చద్దితమ్ములమ్ము తోడ - జారు జంపుకురులతోడ
వద్దనుండివచ్చెనమ్మ - వాడవారిమరది
గద్దరింపు మాటాడీ - కతలకారి వాడు వీడు
పెద్దమేడ పాన్పు మీద - పెంపు సేయు వీనికి
॥తనకు॥
కాటుకంటు చెక్కుతోడ - కడల కెంపు చూపుతోడ
మాటలాడ వచ్చెనమ్మ - మందవారి మగడు
గాటముగను శ్రీవేం - కటనాథుడిట్టె గూడె, (ముద్దు)
మూట గట్టు మెచ్చులాడు - మొక్కరమ్మ వీనికి
॥తనకు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము