అధ్యాత్మ సంకీర్తన
రేకు: 282-4
సంపుటము: 3-473
రేకు: 282-4
సంపుటము: 3-473
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| నీ దాఁకా వలెనా నిచ్చలు నారాయణా ఆది నీ దాసుఁడే చాలు నందరి రక్షించను | ॥పల్లవి॥ |
| నీ పాదమూలమున నిలిచిన జలమును మోపుగా మోచె రుద్రుఁడు ముందు ముందే కాపాడు నీ నామమునఁ గలిగిన మహిమచే పైపై మునులు యిహపరములు గనిరి | ॥నీదాఁ॥ |
| పండేటి పాలవెల్లి నీ ప్రసాదమునఁ గాదె దండిగా దేవతలెల్ల ధన్యులైరి అండనే నీసాకార మాతుమఁ దలఁచి కాదె నిండిన యోగీంద్రులు నిత్యముక్తులైరి | ॥నీదాఁ॥ |
| చేరి నీవిహారమైన శ్రీవేంకటాద్రిఁ గాదె కోరి నరులు వరాలు కొల్లగొనిరి ఆరీతిఁ దాళ్లపాక అన్నమయ్య ఘనుఁడాయ వారివారమై నేము వహికినెక్కితిమి | ॥నీదాఁ॥ |


