Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 168 సంకీర్తన: 172
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 133
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
త్వమేవ శరణం త్వమేవ శరణం
కమలోదర శ్రీజగన్నాథా
॥పల్లవి॥
వాసుదేవ కృష్ణ వామన నరసింహ
శ్రీసతీశ సరసిజనేత్రా
భూసురవల్లభ పురుషోత్తమ పీత
కౌశేయవసన జగన్నాథా
॥త్వమేవ॥
బలభద్రానుజ పరమపురుష దుగ్ధ
జలధివిహార కుంజరవరద
సులభ సుభద్రాసుముఖ సురేశ్వర
కలిదోషహరణ జగన్నాథా
॥త్వమేవ॥
వటపత్రశయన భువనపాలన జంతు
ఘటకారకరణ శృంగారాధిపా
పటుతర నిత్యవైభవరాయ తిరువేం
కటగిరినిలయ జగన్నాథా
॥త్వమేవ॥

(ఈ సంకీర్తన 1వ సంపుటంలో 323వ సంకీర్తనగా ఉంది.)

AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము