సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 174 సంకీర్తన: 179
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 135
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 174 సంకీర్తన: 179
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 135
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధకాంబోది
| తిరుమలగురునేలు - తెరవ సొబగు మరి అరయ నందుకంటె - అరుదే నటవే | ॥పల్లవి॥ |
| అండనుండి పట్ట - నదిమి యాన బోతే కండచక్కెర లైతే - కరగను గాక దొండపండైతే - దునుగును గాక - అమృతపు టుండ గాబోలు నీ - యువిద కెమ్మోవి | ॥తిరుమల॥ |
| పమ్మి చేత బిగ్గ - పట్టేటప్పుడు నిమ్మపండ్లైతే - నిగుడును గాక తమ్మిమొగ్గలైతే - తరలునూ; పసిడి బొమ్మరాలు గాబోలు నీ - పూబోణి కుచములు | ॥తిరుమల॥ |
| అలమేలుమంగ శ్రీవేంక - టప్పని గూడేటప్పుడు కలువ పూదీగ యైతే - కందునూ, కాక పెలుచు రాజిలుకైతే - బెదరునూ, రతి పొలుచు పిలుపు గాబోలు - యీ చెలువ (పలుకు) | ॥తిరుమల॥ |


