సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 237 సంకీర్తన: 248
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 136
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 237 సంకీర్తన: 248
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 136
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| తిరుమలయ్య విందు మంచిదే[1] వుండంటే వుంటినమ్మ సరవిలేని చెంచువారి సంతయేలె తనకును | ॥పల్లవి॥ |
| పరికిదండ పొగడదండ బండిగురిగింజదండ బెరకులేని పికిలిదండ బలిదండలన్నియు మెరసి కానుకియ్యబోతె మేనిదండలడిగెనమ్మ మరల చెంచువారితోడి మాటలేలె తనకును | ॥తిరుమలయ్య॥ |
| ముసురుతేనె జుంటితేనె ముదిరినట్టి పెరలతేనె పొసఁగ మించు పూవుతేనె పుట్టతేనె లన్నియు వొసఁగి కానుకియ్యబోతె మోవితేనె లడిగె నమ్మ యెసఁగ చెంచువారి యెంగి లేఁటికమ్మ [2]తనకును | ॥తిరుమలయ్య॥ |
| వెలగపండు జీడిపండు వెలలేని మోవిపండు పలుకుదొండపండు పాలపండు కానుకిచ్చితే చెలఁగి పక్కపండు మంట శ్రీవెంకటనాయకుఁడు యెలమి కూడెనమ్మ చెంచు లేఁటికమ్మ తనకును | ॥తిరుమలయ్య॥ |
(ఈ సంకీర్తన 5వ సంపుటంలో 26వ సంకీర్తనగా ఉంది.)
[1] వుండంట్ట
[2] తనకు


