సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 200 సంకీర్తన: 209
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 138
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 200 సంకీర్తన: 209
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 138
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మోహనకల్యాణి
| తెరువు వెంట వచ్చే - వరదరాజులను నరులార సేవించరే మ - న కోరికలు మీర | ॥పల్లవి॥ |
| వోరగా సిగవేసి - వొప్పెన సంపంగి విరి తీరుగా సొగసులు - మీరంగ జుట్టి తీరుగా నుదుట క - స్తూరి నామము దీర్చి కేరుకొంటా చెలుల - సారె ముద్దాడుకొంటా | ॥తెరువు॥ |
| హురుముంజి ముత్తియపు - నొంటులు గీలించి పరిమళపు జవ్వాజి చెం - పల వెంట జార వురవున కుంకుమ పు - వ్వుపట్టెలుగా దీసి నెరిమించు చంద్రకావిని - నీటుగా గట్టి | ॥తెరువు॥ |
| వన్నెమీర నేలలు - తిన్నగా బాడుకొంట కిన్నెర మీటుకొంట - గిలుకు పావాలు మెట్టి చెన్ను మీరుచును - శ్రీవేంకటప్రభుడై వన్నెకా డందఱిని - వరము లొసంగుచును | ॥తెరువు॥ |


