Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 263 సంకీర్తన: 278
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 142
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
దంటమాటలనె నన్నుఁ దాఁకనాడేవు వోరి
జుంటితేనె తీపులెల్లఁ జూరలాడేవా
॥పల్లవి॥
అత్తయింటికోడల నన్నమ్మమీఁద నేరా నీ
తొత్తుఁ దిట్టినట్టె తిట్ట దొరకొంటివి
మెత్తనైతే దిగఁబడి మేరమీరి యింతలోనే
ఒత్తుక వచ్చేవు చక్కనుండ నేరవా
॥దంట॥
పంతపు మగఁడు గల పడఁతి నన్ను నేరా నీవు
కొంతైనా వెఱపులేక గోరనంటేవు
ఇంతలోనే వేలువెట్టి యిమ్ముగైకొని వలపు
దొంతులు వేరిచేవు బదుకనియ్యవా
॥దంట॥
ఊరివారి యింతి నన్ను వుద్దండపుఁదుటారాలఁ
బేరుకుచ్చి సొలయుచుఁ బిసాళించేవు
గారవించి తిరువేంకటరాయ నీవు నన్ను
యేరా నాగుట్టంతయు బాయిట[1] వేసేవా
॥దంట॥

(ఈ సంకీర్తన 5వ సంపుటంలో 3వ సంకీర్తనగా ఉంది.)

[1] నిడురేకు 39: గుట్టింతయు బయలు సేసేవా
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము