సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 86 సంకీర్తన: 86
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 144
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 86 సంకీర్తన: 86
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 144
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఘంటారవము
| దినదినము (మదనుడే) - ననుపుకాఁడై యేయ ననబోణి తాళరాదే తనమీద నా మనసు - తగులాయమాయ, చక్కని కృష్ణుడని పిలువ గదవోయి | ॥పల్లవి॥ |
| అలివేణి నేను మును - కలిసియుండిన రీతి దలచి మదనుని - నిలుపరాదు అలనాడు నాతో తా - నాడు మాటలు, నేడు తలచునో లేక తా - దలచదో మదిని | ॥దినదినము॥ |
| చెలితోన నా మీద - కలవిలేనివి కొన్ని తెలిపి తన చిత్తమును - గలతురో సఖులు యిలను బూరుగుమాని - ఫలము నాశించేటి చిలుక కైవడి - తెలియ నౌనొకొ అకట | ॥దినదినము॥ |
| వెలది బాసిన మొదలు - విరహసాగరమున ములిగి యీదగ జాల నేను కలకాల మీ వలపు - కాణయాచై నిల్ప నిల కమలజుండేల - నిటుల వ్రాసె | ॥దినదినము॥ |


