సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 175 సంకీర్తన: 181
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 152
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 175 సంకీర్తన: 181
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 152
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుమ్మకాంబోది
| నాకంటె నీకు గూర్చు - నా చెలియేది యీ కతలు మానవైతి - వింతకు వచ్చియును | ॥పల్లవి॥ |
| పెట్టితి నొసల పట్టు - పిమ్మట నేటికి గుట్టు నెట్టుకొంటీ తలయూచీ - నీడలే దాచ ముట్టవు (ముయికి ముయంట) - ముయ్యగనేలే యింకిటు తొట్టి మై చమటలు నా - తో నేలే సటలు | ॥నాకంటె॥ |
| మానితి నిచ్చ నగవు - మాటికినేలే తగవు పూనితి చెక్కిట కేలు - వొద్దే వేసాలు పూనితి తలచ గరంగు - పొద్దు పొదలే మరుగు ఆనితి కన్నుల నీరు - అప్పటికి నేలె మీరు | ॥నాకంటె॥ |
| చక్క ముడువవు కొప్పు - సారెకు నేటికి కప్పు యిక్కువదే చెమరీని - (యెసరేగే తమినిహో) చక్కని వేంకటపతి - చలి వాసే నిన్ను రతి యెక్కే నీ మోమున నిగ్గు - యిక నేలే సిగ్గు | ॥నాకంటె॥ |


