Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 12 సంకీర్తన: 7
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 154
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కల్యాణి
నాకు నాకె వలపు దెల్ప - నయముగా దీవేళ
నీకు మేలుదానరా కస్తూరి రంగ! - నీకు మేలుదానరా
నీకు మేలుదానరా కావేటి రంగ! - నీకు మేలుదానరా
॥పల్లవి॥
సారె సారెకును నీతో - సన్నసేయగా లేను
వోర జేసుకొని నీ వా - వారిజాక్షి జూచేవు
॥నాకు॥
మాటి మాటికి నీతో - మాటలాడంగ లేను
బాటు చేసుకొని నీ వా - బోటితో ముచ్చటాడేవు
॥నాకు॥
పొంకమైన విరిశయ్య - పొందు వేడంగ లేను
వేంకటరాయ గొంకక నీ - విందరిని కౌగిలించేవు
॥నాకు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము