సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 116 సంకీర్తన: 116
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 156
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 116 సంకీర్తన: 116
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 156
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: నారాయణగౌళ
| నాయంతనే వుద్దండంబున నీ నగరు చొచ్చి సోధించఁగ లేదు పాయక నను మన్నించి యేలుకో నీ ప్రకాశ మౌట మేలు | ॥పల్లవి॥ |
| ధరలో నీ రూపము నీవే దాఁచుకొని యుండఁగను గరుడధ్వజమే నీ గుఱుతు కనుపించెను నాకు బిరుదులు వొగడే శృతులచేతనే [1]పరరేఁగితి నేను పరగిన నీ ప్రతాపతేజమె బయలుసేసె నిన్ను | ॥నాయంతనే॥ |
| యెవ్వరికి నసాధ్యుఁడవై నీవు యేకతమున నుండఁగాను రవ్వసేసి నిను నాకుఁ దెలిపెను రచనల నీ మహిమో చువ్వన నీ విచ్చు వరదహస్తమె చొప్పుచూపఁగాఁ గంటిని నివ్వటిల్లు నీ కరుణ యిందరికి నిన్నిటువలెనే ముంగిటఁ బెట్టె | ॥నాయంతనే॥ |
| శ్రీవేంకటగిరిపై రహస్యమునఁ జెలఁగుచు నుండఁగాను భావింప నలమేల్మంగ సంపదలె పట్టిచ్చెను నీ ప్రభావము దైవికమునఁ బ్రకటించిన తొంటి వుదారగుణము విని శరణు చొచ్చితిమి యీవల నావల మీ చిహ్నములే యింత సేసె మిమ్ము | ॥నాయంతనే॥ |
(ఈ సంకీర్తన 15వ సంపుటంలో 423వ సంకీర్తనగా ఉంది.)
[1] ఱేకు పాఠం - పెరఱేఁగి


