సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 213 సంకీర్తన: 223
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 157
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 213 సంకీర్తన: 223
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 157
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నారాయణగౌళ
| నారాయణతే నమో నమో నారదసన్నుత నమో నమో | ॥పల్లవి॥ |
| మురహర భవహర ముకుంద మాధవ గరుడగమన పంకజనాభ పరమపురుష భవబంధ విమోచన నరమృగశరీర నమో నమో | ॥నారాయణతే॥ |
| జలధిశయన రవిచంద్రవిలోచన జలరుహభవనుత చరణయుగ బలిబంధన గోపవధూవల్లభ నలినోదర తే నమో నమో | ॥నారాయణతే॥ |
| ఆదిదేవ సకలాగమపూజిత యాదవకుల మోహనరూప వేదోద్ధర శ్రీవేంకటనాయక నాదప్రియ తే నమో నమో | ॥నారాయణతే॥ |
(ఈ సంకీర్తన 4వ సంపుటంలో 32వ సంకీర్తనగా ఉంది.)


