సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 120 సంకీర్తన: 121
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 158
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 120 సంకీర్తన: 121
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 158
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్ర - త్రిపుట
| నిండ నేగురు - నెలఁతలుండంగ - నేనెంత యింపైతినే కొండవంటి దొర - కొలువు మొక్కుమొక్కి - కొలఁదిగానే నడిపెనే | ॥పల్లవి॥ |
| ఏటికింత యెంచె నేనేమి (సేయగల) నేమి - బ్రాతే తనకును మాట పంతంబులు మల్లడి పొందులు - మాయకాడు గదవె తాను పాటిలేదే తనకు - పాదమేలంటీనె - (పాదతాకు కాంతనే) ఆటదాననింతె- అమ్మకనేజెల్ల - అందచందము లెరుగడాయె | ॥నిండ॥ |
| చలమేల చేసీనె - చక్కదనమేమో - (సటకాడు కదవే తాను) అలపులసొలపుల - ఆసలవేసాల - అందగాడు కదవె తాను తలపెంత మెత్తనో - తమ్ములము వేడీని - (తరితీపు సేయువాడె) యిలువరుసలెంచ తా -నెంత నేనెంతనే-నేపాటి తెలియడటవే | ॥నిండ॥ |
| ఎంత బత్తిచేసె - నేయేరతుల మించె - నేనేమెరుంగుదునే రంతుల పంతాల - రాపుల తీపుల - రట్టుకాడు తాను గదవే కాంతామణిరొ! - నన్ను - (కల్యాణమై) శ్రీవేం-కట నాథుడే గూడెనే దొంతరగా నన్ను - దొరయురము పైనుంచు - దొరతనంబెరుగడటవె | ॥నిండ॥ |


