అధ్యాత్మ సంకీర్తన
రేకు: 283-1
సంపుటము: 3-476
రేకు: 283-1
సంపుటము: 3-476
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| నేరుపు నతఁడే నేరమి నతఁడే భారమెల్ల నాతఁడే పని లేదు మాకు | ॥పల్లవి॥ |
| దేవుఁడట యంతరాత్మ దేహమెంచి చూచితేను పోవుల కర్మాలు సేయఁ బుట్టినదట జీవుఁ డేఁటివాఁ డిందు శ్రీపతియానాజ్ఞఁ గాక భావించఁ బాపపుణ్యాలు పనిలేదు మాకు | ॥నేరు॥ |
| హరి లోకాలేలునట అతని మాయకు లోనై నరుల జీవనములు నడచీనట వెరవులు మాకేల విష్ణుఁడే యింతాఁ గాక పరచు విచారాలు పనిలేదు మాకు | ॥నేరు॥ |
| వేడుక నాలుకను శ్రీవేంకటేశు నామమట పాడితో నాతనికి నే బంటనట తోడునీడ యాతఁడే తోవ చూప నాతఁడే పాడయిన కోరికలు పనిలేదు మాకు | ॥నేరు॥ |


