Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 148 సంకీర్తన: 151
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 162
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
నీకేమి జాణకాడవు - నీవు లెస్స
కాకుసేయక తిరిగేవు - కంటిమి నీజాడలు
॥పల్లవి॥
అడవిలోనివారము - అంతలేసి నేరము
యెడల పొడల పుట్టమి - చ్చే వు (నీవు) జడిసి మారు
కడకాచీరలు గడితే - కన్నవారు బూచంటా
విడిచారల పులియంటా - వెరతురు గాని
॥నీకేమి॥
వంకలు మాకురులు మరుని - జింక వేట కురులు
కొంకక మేముండుతావు - కొండలచరులు
కంకణాలిచ్చేవు - ఘల్లుఘల్లనంగా
బింకపు మాచింకలెల్ల - బెదరీపోగాను
॥నీకేమి॥
మొగనాలిననగానే - మురియు శ్రీవేంకటేశు
డొగిమీరగా గంద - వొడిమేన జల్లేవు
మగుడీ మావారితోన - మాకుల పుప్పొడి
పొగడీ, రాలేననీ - బొంకేవే
॥నీకేమి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము