Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 158 సంకీర్తన: 161
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 163
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: పాడి
నీపొందెన్నటికి బోదు - నే వేగిరపు దానను
యేపున సవతుల రానీక - నీ యీవటుండవే
॥పల్లవి॥
నీముందూడిగము సేసే - నీవు పూలు గోయవే
చేముంచి యందుకోలేను - చిన్నదానను
మామకూతురవు నీవు - మాపటికి వరుసయె
యేమర నీయుపకారము - యెన్నటికిని జెడదు
॥నీపొందె॥
దోమటి నీ మారే నే - దొడికే వడ్డించవే
యేమేమో యెక్కటివలెనో(?) - యికనే ర్చెను
గోమున జేరువనుండి - గ్రుక్కిళ్లు మింగరాదు
వేమారులిందుకే నిన్నిటు - లేమరి నుతింతురిందరు
॥నీపొందె॥
పక్కనే బండేగానీ - పాదాలు నీవొత్తవే
(మిక్కిలి) శ్రీవేంకటనాథుని - మెప్పింతువు
మక్కువతో నలమేలు - మంగను భూకాంతను
నిక్కపు పేరులే వేరు - నీవె నేనే గానా
॥నీపొందె॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము