సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 28 సంకీర్తన: 26
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 166
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 28 సంకీర్తన: 26
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 166
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| నీవనఁగ నొకచోట నిలిచివుండుటలేదు నీవనుచుఁ గనుఁగొన్న నిజమెల్ల నీవే | ॥పల్లవి॥ |
| తనయాత్మవలెనె భూతములయాతుమలెల్ల- ననయంబుఁ గనుఁగొన్నయతఁడే నీవు తనుఁగన్నతల్లిఁగా తగనితరకాంతలను అనఘుఁడై మదిఁజూచునతఁడే నీవు | ॥నీవనఁగ॥ |
| సతతసత్యవ్రతాచారసంపన్నుఁడై అతిశయంబుగ మెలఁగునతఁడే నీవు [1]ధృతిదూలి ద్రవ్యంబు తృణముగా భావించు- హతకాముకుఁడైనయతఁడే నీవు | ॥నీవనఁగ॥ |
| మోదమున సుఖదుఃఖములు నొక్కరీతిగా నాదరింపుచునున్నయతఁడే నీవు వేదోక్తమతియైన వేంకటాచలనాథ ఆదియును నంత్యంబు నంతయును నీవే | ॥నీవనఁగ॥ |
(ఈ సంకీర్తన 1వ సంపుటంలో 232వ సంకీర్తనగా ఉంది.)
[1] ‘దృతి’ రేకు


