అధ్యాత్మ సంకీర్తన
రేకు: 283-2
సంపుటము: 3-477
రేకు: 283-2
సంపుటము: 3-477
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| మునుల తపము నదె మూలభూతి యదె వనజాక్షుఁడే గతి వలసినను | ॥పల్లవి॥ |
| నరహరి నామము నాలుక నుండఁగ పర మొకరి నడుగఁ బనియేల చిరపుణ్యము నదె జీవరక్ష యదె సరుగఁ గాచు నొకసారె నుడిగినా | ॥మును॥ |
| మనసులోననే మాధవుఁ డుండఁగ వెనుకొని యొకచో వెదకఁగనేఁటికి కొనకుఁగొన యదే కోరెడి దదియే తనుఁ దా రక్షించుఁ దలఁచినను | ॥మును॥ |
| శ్రీవేంకటపతి చేరువ నుండఁగ భావ కర్మముల భ్రమయఁగనేఁటికి దేవుఁడు నతఁడే తెరువూ నదియే కావలెనంటేఁ గావకపోఁడు | ॥మును॥ |


