సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 76 సంకీర్తన: 75
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 169
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 76 సంకీర్తన: 75
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 169
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: లుప్తము
| నెలఁతఁ బాసి వుండలేను నిమిష మెందు నేఁడు నాకు తలఁపులో నీవలెనే రతుల తరుణిఁ గలయు టెన్నఁడే | ॥పల్లవి॥ |
| ముదిత నాయెదుట నిలిచి మోసులువార నవ్వు నవ్వి కదలుఁజూపులఁ జూచి నాకు కన్ను లార్చు టెన్నఁడే వదలుఁ బయ్యద సవదరించి వలపుతేట చవులు చూపి కొదలు మాటల ముద్దు గునిసి కూరిమి గొసరు టెన్నఁడే | ॥నెలఁతఁ॥ |
| చెలియ సిగ్గున మోము వంచి చెక్కునఁ జేయి మాటు సేసి మలసి వీడె మిచ్చి ఆకు మడిచి యిచ్చు టెన్నఁడే వలుద చన్ను లురము మోఁపి వాసన యూర్పు చల్లిచల్లి కలయ మోవితేనె లొసఁగు కంచము పొత్తులెన్నఁడే | ॥నెలఁతఁ॥ |
| యింతి నన్నుఁ జేరఁ బిలిచి యింటిలోని పరపు మీఁద దొంతికళలు రేఁగ నంటి దొమ్మి సేయు టెన్నఁడే వింత లేక యిపుడె శ్రీవేంకటేశ్వరుఁడనైన పొంతనున్న నన్నుఁగూడ పొద్దు దెలియు టెన్నఁడే | ॥నెలఁతఁ॥ |
(ఈ సంకీర్తన 17వ సంపుటంలో 20వ సంకీర్తనగా ఉంది.)


